నీ పాద సన్నిధికి – కృపామయ యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు – దేవా నే వచ్చితిని

1. విశ్రాంతి నిచ్చెడు దేవా – శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము – హాయిగా నచటుండెదను

2. నరమాత్రుడవు నీవు కావు – మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు – యేసు నీదరి చేరెదను

3. నన్ను చేయి విడువకు నాథా – నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత – నీ బలము నా కిమ్ము