Online Bible Quiz Live | Episode -79 | 1 Chronicles – 1 దినవృత్తాంతములు 11 – 20

Passage Round:

యెహెజ్కేలు 37: 1-10

1 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా
​యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.
ఆయననర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగాప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.
అందుకాయనప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుముఎండి పోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి.
ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగామీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;
చర్మము కప్పిమీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడునేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించు చుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను.
నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను.
అప్పడు ఆయననరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్ల నుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగాజీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.
10 ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.