ఏమి లేని వాడను – నాలో ఉన్న వాడు
ఎప్పటికి ఉన్నవాడును అనువాడును
ఆయన యందు సంపూర్ణత కలదు
ఆయన యందు సర్వము కలదు

1. ఆకాశమందు ఆయన నాకుండగా
భువియందు ఏదియు నాకక్కరలేదు
నాకేమి కొదువ లేదు – నాకు లేమి కలుగదు
ఈ లోకం తాత్కాలికమని నే నెరుగుదును
ఇల ఉన్నవన్నీ వ్యర్థమని నే నెరుగుదును

2. శాశ్వతుడైన దేవుడు నాకుండగా
శాశ్వత నివాసం పరమందు కలదు
సంతృప్తి కలదు నాకు – యుగయుగములు ఉండేద
ఇదియే నా విశ్వాసము నా నిరీక్షణ
ఇదియే నా గమ్యము క్రీస్తేసులో