నీవే నా సంతోషగానము – రక్షణశృంగము మహాశైలము
బలశూరుడా యేసయ్యా నా తోడై – ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు

ఓ లార్డ్! యు బి ద సేవియర్ – షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ – సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్ – యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్

Verse 1
త్యాగము ఎరుగని స్నేహమందు – క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి – నీ ప్రేమతో నన్నాకర్షించినావు
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో

Verse 2
వేదన కలిగిన దేశమందు – వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి – ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం

Verse 3
నిర్జీవమైన ఈ లోయయందు – జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ – నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు

Neeve Naa Santhosha Gaanamu – Rakshana Shrungamu Mahaa Shailamu

Balashoorudaaa Yesayyaa Naa Thodai – Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu

O Lord! You be the Savior – Show me some mercy
Bless me with Your grace – Savior! Fill me with Your love
I will surrender – You are my king Glory to the Jesus

Verse 1:
Thyaagamu Erugani Snehamandu – Kshemamu Karuvai Yundagaa
Nija Snehithudaa Praanamu Petti – Nee Prematho Nannaakarshinchinaavu
Nirantharam Niluchunu Naapai Nee Kanikaram
Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho

Verse 2:
Vedana Kaligina Deshamandu – Vekuva Velugai Nilichinaavu
Viduvaka Thodai Abhivruddhi Parachi – Aiguputhulo Simhaasanamichchinaavu
Maaradu Ennadu Neevichchina Darshanam
Anudinam Anukshanam Neetho Naa Jeevitham

Verse 3:
Nirjeevamaina Ee Loyayandu – Jeevaadhipathivai Velasinaavu
Heena Shareeram Mahima Shaareeramuga – Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu
Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu
Hosannaa Hosannaa Neeve Maharaajuvu