పల్లవి:

ఊహకు అందని నీకృప నాపై కుమ్మరించిన దేవుడా
తరములు గడచినా తరగని నీ కృప మాపై చూపిన పూజ్యుడా
శిధిలమైన నా పరిస్థితులు ||2||
మార్చగలిగెను నీ కృపే
మార్చేనే నీ కృప || ఊహకు||

1. గెరారు దేశములో విత్తనమేయగా నూరంతల ఫలము పొందినా ||2||
ఇస్సాకు దీవెన కావాలయ్య ||2||
అర్పణగా నేను మారాలయ్య ||2|| || ఊహకు ||

2. గెరారు లోయలో బావులు త్రవ్వగా నీటి ఊటలు ఉబికేను ||2||
ఎండిన బావులు ఉబకాలయ్య ||2||
నీటి ఊటగా మారాలయ్య నీటి బుగ్గగా మారాలయ్య || ఊహకు ||

3. ఈ సంవత్సరములో నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ||2||
నిలుచునట్లుగా ఆశీర్వదించుము ||2||
నూరంతల ఫలము దయచేయుము ||2|| || ఊహకు ||