Telugu
పల్లవి:
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
చరణం1
ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను (స్తుతి పాడుటకే)
చరణం2
నాపై ఉదయించె నీ మహిమకిరణాలు
కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలను పొంది నీ కాడి మోయుటకు
లోకములో నుండి ఏర్పరచినావు
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను (స్తుతి పాడుటకే)
చరణం3
హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచెను ప్రతిస్థలమున పారెను సెలయేరులై (స్తుతి పాడుటకే)
English
Stuti paadutake bratikinchina
jeevana daatavu neevenayya
innalluga nannu posinncina
tallivale nanu odarcina
nee prema napai ennadu maaradu yesayya (2)
jeevita kalamanta adhāraṁ nevenayya
naa jeevita kaalamanta aaradhinchi ghanaparatunu
1. Pranabhayamunu tolaginncinavu
prakaramulanu sthapincinaavu
sarvajanulalo nee mahima vivarimpa
dirghayuvuto nanu nimpināvu (2)
nee krupa bahulyame – veedani anubandhamai
talacina prati ksanamuna – nutana balamiccenu
2. Naapai udayinnce nee mahima kiranaalu
kanumarugayenu naa dukhadinamulu
krupalanupondi nee kadi moyutaku
lōkamulonundi ērparacināvu (2)
nee divya saṅkalpame – avanilo subhapradamai
nee nitya rājyamunakai – nireeksana kaliginncenu
3. Hetuvu lekaye premincinavu
vedukaga ila nanu marcinaavu
kalavaramondina velalayandu
naa cheyyi viduvaka naḍipincinaavu (2)
n prema madhuryame – na nota stuti ganamai
nilicina prati sthalamuna – parenu selayerulai