(Visited 38 times, 1 visits today)
HOSANNA MINISTRIES 2024 ALBUM Lyrics
Last modified: March 8, 2024
Written by admin• March 7, 2024• 11:59 pm• Telugu Christian Songs - Lyrics
Sraavyasadhanamu – శ్రావ్యసదనము
నీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా
చరణం :- 1
విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం (2)
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే
నా యేసయ్యా
( నీవే శ్రావ్యసదనము )
చరణం :- 2
నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు (2)
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి
నా యేసయ్యా
( నీవే శ్రావ్యసదనము )
చరణం :- 3
పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా (2)
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి
నా యేసయ్యా
( నీవే శ్రావ్యసదనము )
HOSANNA MINISTRIES 2024 ALBUM Lyrics
Last modified: March 8, 2024