Telugu
ఆరాధనా … నీకే యేసయ్యా …
స్తుతి మహిమలు నీకే చెల్లునుగా చెల్లునుగా…
ఎల్-షదై నీకే ఆరాధనా
ఎలోహిం నీకే ఆరాధనా ||2||
సర్వశక్తిమంతుడా… సర్వాంతర్యామివినీవే…
సర్వ లోకానికే … ఏకైక దేవుడా నీవే …. ||2||
యేసయ్య నీకే ఆరాధనా ||4||
జీవాధి పతియైన దేవా ..
జీవప్రధాతవు నీవే …
నిత్యము జీవింపచేసే..
శాశ్వత జీవము నీవే…. ||2||
నాశక్తి చాలదు దేవా..
నేబ్రతికి ఉండుటకూ ….
నా భక్తి చాలదు ప్రభువా..
నే జీవించుటకూ… ||2|| ||ఎల్-షదై ||
ఆశ్రయ దుర్గమయిన దేవా..
నా ఆశ్రయము నీవే ..
నిత్యము భద్రత నిచ్చే….
ఎతైన కోటవునీవే….||2||
మహిమప్రభావముల్ నీకే…
నే బ్రతుకు దినములన్నీ ….
కృతజ్ఞత స్తోత్రముల్ నీకే…
నే.. జీవించు దినములన్నీ ..||2|| ||ఎల్-షదై ||
ఆరాధనా…..నీకే యేసయ్యా… ||2||
ఆదియు, అంతము నీవే…
ఆల్ఫా ఒమేగయు నీవే …
నిన్న నేడు నిరతం..
వున్నవాడవు నీవే.. ||2||
నీవంటి వారు ఎవరు..
ఈలోకమంతటిలో
నీసాటిలేరు ఎవరు
ఈసృష్టి అంతటి లో ||ఎల్-షదై||
సర్వశక్తిమంతుడా , సర్వాంతర్యామివినీవే
సర్వ లోకానికే, ఏకైక దేవుడా నీవే ||2||
యేసయ్య నీకే ఆరాధనా ||2|| ఎల్-షదై ||2||
English