(Visited 93 times, 1 visits today)
HOSANNA MINISTRIES 2024 ALBUM Lyrics
Last modified: March 8, 2024
Written by admin• March 7, 2024• 11:32 pm• Telugu Christian Songs - Lyrics
Kannuletthuchunnanu – కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్య (2)
కలవమునొందను నిను నమ్మియున్నాను
కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2)
చరణం :- 1
ఆకాశముపై నీ సింహాసనం ఉన్నదీ
రాజదండముతో నన్నేలుచునది (2)
నీతిమంతునిగా చేసి
నిత్యజీవము అనుగ్రహించితివి (2)
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా
( ఆకాశమువైపు )
చరణం :- 2
ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నడిపించుచున్నావు (2)
నీ మహిమతో నను నింపి
నీ దరికి నను చేర్చితివి
నీవు ఉండగా ఈ లోకములో
ఏదియు నాకక్కరలేనేలేదయ్యా (2)
( ఆకాశమువైపు )
చరణం :- 3
ఆకాశము నుండి అగ్ని దిగివచ్చియున్నది
అక్షయ జ్వాలగ నాలో రగులుచునది (2)
నా హృదయము నీ మందిరమై
తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నను మార్చి నాలో
నిరంతరము నివశించితివి
( ఆకాశమువైపు )
చరణం :- 4
ఆకాశము నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది
భాషలేని మాటలే స్వరమే వినబడని
పగలు భోధించుచున్నది
రాత్రి జ్ఞానం ఇచ్చుచున్నది
( ఆకాశమువైపు )
HOSANNA MINISTRIES 2024 ALBUM Lyrics
Last modified: March 8, 2024
March 7, 2024 • Telugu Christian Songs - Lyrics • Views: 60