Written by 3:16 pm Telugu Christian Songs - Lyrics

Kraisthava Jeevitham | క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం Song Lyrics

Kraisthava Jeevitham | క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం | Telugu Christian song Lyrics

[tps_header]Kraisthava Jeevitham | క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం[/tps_header]

పల్లవి :

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం
|| 2 ||
అ:ప : కష్టములు వచ్చిన నష్టములు
వచ్చిన
యేసు ప్రభువే నా సహకారి || 2 ||

1. ఈ లోక ఘనత నన్ను విడచినన్
లోకస్థులెల్లరు నన్ను విడచినన్ || 2 ||

నా సహోదరులు నన్ను విడచినన్
యోసేపు దేవుడే నా సహకారి || 2 ||
|| క్రైస్తవ జీవితం ||

2. అంధకారంబు భువి నావరించిన
రాజులు ఘనులు శత్రువులైనను || 2 ||

అగ్ని గుండములో సింహపు బోనులో
దానియేలు దేవుడే నా సహకారి || 2 ||
|| క్రైస్తవ జీవితం ||

3. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహయకుడు || 2 ||

భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదను || 2 ||
|| క్రైస్తవ జీవితం ||

4. బురశబ్దంబు మ్రెాగెడివేళ
శ్రమలొందిన నా ప్రభుని చూచెదను || 2 ||

ఏనాడో ఎప్పుడో నీవు వచ్చెదవూ
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ || 2 ||
|| క్రైస్తవ జీవితం ||

(Visited 24 times, 1 visits today)

Last modified: August 27, 2022

Close